భుల్లార్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే

31 Jan, 2014 11:37 IST|Sakshi
భుల్లార్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: తీవ్రవాది దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తన భర్తకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని భుల్లార్ భార్య పెట్టుకున్న అభ్యర్థన మేరకు అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. భుల్లార్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనపై రాష్ట్రపతి నిర్ణయం ఆలస్యమైనందున అతడి మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అతడికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చాలని పిటిషన్లో భుల్లార్ భార్య పేర్కొన్నారు.

దీంతో భుల్లార్కు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై పునః సమీక్షకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అలాగే అతడికి విధించిన మరణశిక్షపై స్టే విధించింది. భుల్లార్ భార్య అభ్యర్థనపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భూలార్ ఆరోగ్య పరిస్థితిపై వారంలోగా నివేదిక సమర్పించాలని అతడు చికిత్స పొందుతున్న ఆస్పత్రిని ఆదేశించింది. 1993 ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలడంతో భుల్లార్కు న్యాయస్థానం గతంలో ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు