గిఫ్ట్‌ గా 125 హోండా యాక్టివా స్కూటర్లు

21 Apr, 2017 11:08 IST|Sakshi
గిఫ్ట్‌ గా 125 హోండా యాక్టివా స్కూటర్లు

సూరత్‌: తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు గుజరాత్‌ కు చెందిన వ్యాపారవేత్త విభిన్నమైన ఇంక్రిమెంట్‌ ఇచ్చాడు. ఆర్థిక మందగమనంలోనూ మంచి ఫలితాలు సాధించినందుకు సూరత్‌ వజ్రాల వ్యాపారి లక్ష్మిదాస్‌ వెకారియా తన కంపెనీ ఉద్యోగులకు స్కూటర్లు బహుమతిగా ఇచ్చారు. 125 మందికి హోండా యాక్టివా 4జీ స్కూటర్లను కానుకగా ఇచ్చారు. ఉద్యోగులకు రివార్డులు ప్రకటించేందుకు వెకారియా రూ. 50 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఆయన కంపెనీలో 5,500 మంది పనిచేస్తున్నారు.

గుజరాత్‌ లో ఉద్యోగులకు ఖరీదైన కానుకలు ఇచ్చిన రెండో వ్యాపారవేత్తగా వెకారియా నిలిచారు. గతేడాది దీపావళికి వజ్రాల ఎగుమతి వ్యాపారి సావ్జీభాయ్ ఢోలకియా తన కంపెనీ ఉద్యోగులకు 1260 కార్లు, 400 ఫ్లాట్లు, ఆభరణాలు కానుకలుగా ఇచ్చి ఔరా అనిపించారు. వజ్రాలను సానబెట్టి, ఎగుమతి చేయడానికి సూరత్‌ ప్రసిద్ధి గాంచింది.


 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు