8 శాతం వృద్ధి సాధ్యమే- నిర్మలా సీతారామన్

6 Oct, 2016 14:10 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు  ఎనిమిది శాతం దాటుతుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  విశ్వాసం వ్యక్తం చేశారు.   కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న  వ్యాపారంలో  పారదర్శక ప్రక్రియలు, టెక్నాలజీ  రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశ  8 శాతం వృద్ధికి సహాయం చేస్తుందన్నారు. ఈ విషయంలో  రాష్ట్రాలు కూడా  కేంద్రంతో కలిసి పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం, సీఐఐ సంయుక్తంగా  గురువారం  ఏర్పాటు చేసిన *ఇండియా ఎకానమిక్ సమ్మిట్ 2016'  ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.  8 శాతం వృద్ధి) సాధించడం సాధ్యమేనని, ఆ నిబద్ధతతోనే ప్రభుత్వం పనిచేస్తోందని  కేంద్రమంత్రి చెప్పారు.  అవినీతిని తొలగించి పారదర్శకత తీసుకొచ్చేందుకు  ప్రభుత్వం టెక్నాలని ఉపయోగిస్తోందని తెలిపారు.  వస్తు సేవల పన్ను, జామ్ (జన్ ధన్, ఆధార్,మొబైల్), పెట్టుబడుల వృద్ధి, ప్రోత్సాహం ద్వారా వ్యాపార నిర్వహణ అనే మూడు ప్రధాన అంశాలపై తాము పనిచేస్తున్నట్లు చెప్పారు.  

ఈ విషయాంలో కేంద్రానికి,రాష్ట్రాలకు  మధ్య ఉన్న  విబేధాలను, కష్టాలను తొలగించేందుకు  పనిచేయాలన్నారు. దీనికి కోసం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రానున్న మూడు నాలుగు నెలల్లో వారితో కలిసి పనిచేసిన  ఈ అవరోధాలన్నింటినీ అధిగమించనున్నామన్నరు.  విదేశీ పెట్టుబడులు దేశానికి తరలి వస్తున్నాయని నిర్మల తెలిపారు. కానీ వాటిని అర్థవంతమైన పెట్టుబడులుగా ,   ఉద్యోగాలను వేగంగా  సృష్టించేలా చేసుకోవాలని సీతారామన్ అన్నారు.   పెండింగ్లో  పనులకు  తమ దగ్గర సమగ్ర ఎజెండా ఉందనీ,   కానీ లక్ష్య సాధనలో  ఇంకా చేయాల్సి ఉందనీ తెలిపారు.   ప్రపంచ వృద్ధిలో దక్షిణ,  ఆగ్నేయ ఆసియా దేశాలు కీలక శక్తులుగా పనిచేయనున్నాయని ఆమె జోస్యం చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు