కొట్టి, తిట్టి లాగి పడేశారు- స్టాలిన్‌

18 Feb, 2017 15:08 IST|Sakshi
కొట్టి, తిట్టి లాగి పడేశారు- స్టాలిన్‌

చెన్నై: డీఎంకే  వర్కింగ్‌  ప్రెసిడెంట్‌  అసెంబ్లీ  రగడపై తీవ్రంగా   స్పందించారు.  తమిళనాడు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయుడికి తీరని అవమానం జరిగిందని ధ్వజమెత్తారు.  స్పీకర్‌  సభా మర్యాదలు పాటించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.  తన చిరిగిన చొక్కాను చూపిస్తూ   కొట్టి, తిట్టి  తమను   బలవంతంగా  బయటకు లాగిపడేశారని ఆరోపించారు.  సభలో జరిగిన పరిణామాలు,  పరిస్థితులను వివరించేందుకు గవర్నర్‌తో  భేటీ కానున్నట్టు చెప్పారు.   దీనిపై ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. రహస్య ఓటింగ్‌ జరగాలని మరోసారి డిమాండ్‌  చేశారు.  ఇందుకోసం అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని   పేర్కొన్నారు.

సభలోతీవ్రం గందరగోళ పరిస్థితుల మధ్య బయటికువచ్చిన డీఎంనే నేత స్టాలిన్‌ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను అవమానించారని మండిపడ్డారు. సభా మర్యాదలు పాటించలేదనిని మండిపడ్డారు.

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నడుమ ప్రారంభంనుంచీ అసెంబ్లీలో రహస‍్య ఓటింగ్‌ పై రగడ నెలకొంది. దీంతో అసెంబ్లీ నుంచి డీఎంకే నేతలపై మార్షల్స్‌ రంగంలోకి దిగారు. ఒక్కొక్కర్నీ  చేతులపై  ఎత్తిపట్టుకునే బయటకు లాగి పడేశారు.  కొంతమంది ఎమ్మెల్యే చొక్కాలు చిరిగా పోయాయి.  పలువురికి  గాయాలయ్యాయి. ముఖ్యంగా డీఏంకు నేత స్టాలిన్‌ కు చొక్కా చిరిగిపోయింది.  దీంతో ఆందోళన మరింత ముదిరింది.  డీఎంకే ఎమ్మెల్యేల  బహిష్కరణ,  స్పీకర్‌ పోడియం వద్ద స్టాలిన్‌  చేపట్టిన ధర్నా లాంటి ఉద్రిక్త పరిస్థితులమధ్య   మార‍్షల్స్‌ను  ఎమ్మెల్యేలను బయటకు  లాగి పడేయడం కనిపించింది. దీంతో మరింత గందరగోళం చెలరేగింది.