రూ.2 వేల నోటు టెస్టింగ్ వీడియో సంచలనం

14 Nov, 2016 15:16 IST|Sakshi
రూ.2 వేల నోటు టెస్టింగ్ వీడియో సంచలనం

న్యూఢిల్లీ:  నాన్ బ్రేకబుల్ వస్తువులను ఎత్తయిన ప్రదేశాలనుంచి కిందపడేసి  టెస్ట్ చేయడం  చూశాం....వాటర్ ప్రూఫ్ స్మార్ట్ఫోన్లు   పరీక్షించడం చూశాం.. ఇపుడు  రెండు వేల రూపాయల నోటు వంతు వచ్చింది. అవును.. కొత్తగా ప్రజల చేతుల్లో కళకళలాడుతున్న రెండువేల నోటును కడుగుతున్న వీడియో ఒకటి   నెట్ లో చక్కర్లు కొడుతుంది.   ట్యాప్ లోంచి  ధారాళంగా పడుతున్న నీటి కింద రూ.2000  నోటును ఒక వ్యక్తి కడుగుతున్న వీడియో ఒకటి సంచలనం రేపుతోంది. ఎవరు..ఎక్కడ చేశారు అనేవివరాలు తెలియనప్పటికీ.. ఆదివారం  సోషల్ మీడియా  షేర్  అయిన క్షణాల్లో వైరల్ అయిది. లక్షల కొద్దీని వ్యూస్ ను  సొంతం చేసుకుంటూ యూ ట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది.   ఫేస్బుక్  లాంటి ఇతర సోషల్‌ మీడియాలలో ట్రెండింగ్  టాపిక్గా మారింది.