2017లో ట్విట్టర్ మూత నిజమేనా?

12 Aug, 2016 12:53 IST|Sakshi
2017లో ట్విట్టర్ మూత నిజమేనా?

2017లో సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ను మూసివేయనున్నారని వస్తున్న వార్తలను కంపెనీ ఖండించింది. 2017లో కంపెనీని మూసివేయనున్నట్లు వచ్చిన వార్తలకు ఆధారాలు లేవని పేర్కొంది. వీటిపై స్పందించిన కంపనీ అధికార ప్రతినిధి.. కంపెనీని మూసివేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు.

#సేవ్ ట్విట్టర్ తో ట్విట్టర్ ను క్లోజ్ చేయొద్దంటూ గురువారం దాదాపు లక్ష మందికి పైగా యూజర్లు ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన కంపెనీ.. ఈ రూమర్ ఎలా పాకిందో తెలియడం లేదని పేర్కొంది. ఆన్ లైన్ వేధింపులను ట్విట్టర్ ఆపలేకపోతుండటమే ట్విట్టర్ మూసివేతకు కారణం అని ఓ యూజర్ పోస్ట్ చేసిన ట్వీట్ ఫలితమే ఇది అని చెప్పారు. ట్విట్టర్ ను ప్రారంభించిన నాటి నుంచి ఆన్ లైన్ వేధింపులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. గతనెలలో వేధింపుల కింద వందలాది వినియోగదారుల అకౌంట్లను ట్విట్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు