ఆరేళ్లపాపపై హైస్కూల్ బాలురు అత్యాచారం

4 May, 2015 12:00 IST|Sakshi
ఆరేళ్లపాపపై హైస్కూల్ బాలురు అత్యాచారం

బెంగళూరు: బెంగళూరులో మరో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల పాపపై 13 ఏళ్ల హైస్కూల్ విద్యార్థి బెంగళూరు శివారులో లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం శనివారం రోజు  పాప తన సోదరుడు మరో ఇద్దరు అబ్బాయిలతో కలసి ఆడుకుంటున్నప్పుడు ఆ ఇద్దరు బాలురు పాపను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఆకృత్యానికి పాల్పడ్డారు.

కనిపించకుండాపోయిన తన చెల్లెలును వెతుక్కుంటూ వెళ్లిన సోదరుడు ఈ విషయం గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు