ఖైదీని సజీవదహనం చేసిన జైలు అధికారి

28 Jul, 2014 15:40 IST|Sakshi

బీహార్ జైల్లో ఘోరం జరిగింది. ఓ విచారణ ఖైదీపై జైలు అధికారి కిరోసిన్ పోసి నిప్పంటించడంతో అతడు పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రూపేష్ పాశ్వాన్ అనే వ్యక్తిని ఆయుధాల చట్టం కింద గత నాలుగేళ్లుగా నవాడా జైల్లో విచారణ ఖైదీగా ఉంచారు. జైలర్ లాల్ బాబూ సింగ్, అతడి సహచరులు గోపీ యాదవ్, బ్రహ్మదేవ్ యాదవ్ కలిసి తనపై కిరోసిన్ పోసి తగలబెట్టేశారని పాశ్వాన్ తన వాంగ్మూలంలో తెలిపాడు.

అతడికి 80 శాతం కాలిన గాయాలు కావడంతో పాట్నా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స సొందుతూ అతడు మరణించాడు. అయితే.. జైలు అధికారులు మాత్రం పాశ్వాన్ తనకు తానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని జైలు అధికారులు అంటున్నారు.

మరిన్ని వార్తలు