యూపీ ఎన్నికలు : బీజేపీ నేతపై కేసు నమోదు

9 Jan, 2017 09:05 IST|Sakshi
యూపీ ఎన్నికలు : బీజేపీ నేతపై కేసు నమోదు
కుటుంబ రాజకీయాలతో సతమతమవుతున్న సమాజ్వాద్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో అప్పుడే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఓటర్లను ప్రలోభపెడుతూ గేదెలు, యెడ్ల బండ్లు, దుప్పట్లను పంచిపెడుతున్న కుందర్కి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్వీర్ సింగ్పై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించి రామ్వీర్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ అదే నియోజకవర్గానికి చెందిన ఎస్పీ అభ్యర్థి హజీ రిజ్వాన్ ఆయనపై కేసు నమోదుచేశారు. ఎన్నికల కమిషన్ గత వారం వెల్లడించిన పోలింగ్ షెడ్యూల్తో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియామళి అమల్లోకి వచ్చింది.
 
 
బీజేపీ నేత పంచిపెడుతున్న గేదెలు, బండ్లు చిత్రాలు సోషల్ మీడియాలో సైతం హల్ చల్ చేస్తున్నాయి. దుప్పట్లతో పాటు రోజువారీ వాడక వస్తువులను సింగ్ పంచిపెడుతున్నట్లు రిజ్వాన్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తాము విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగ్ పెట్టడం, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేయడంపై ఎస్ఐ రత్నేష్‌ కుమార్ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్టు పోలీసులు చెప్పారు. అయితే ఈ ఆరోపణలపై రామ్వీర్ సింగ్ ఎలాంటి స్పందన తెలుపడం లేదు. ఈ బీజేపీ నేత పార్టీ టిక్కెట్ కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు. 
>
మరిన్ని వార్తలు