'వాట్సాప్ వైరస్' : భద్రతా ఏజెన్సీల హై అలర్ట్

2 Jan, 2017 11:11 IST|Sakshi
'వాట్సాప్ వైరస్' : భద్రతా ఏజెన్సీల హై అలర్ట్

న్యూఢిల్లీ: ఇన్ స్టెంట్  మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ పై కేంద్ర భద్రతా ఏజన్సీలు హై అలర్ట్ జారీ చేశాయి. దేశంలో రెండు సంచలనాత్మక  వైరస్ ఫైల్స్  భారీగా షేర్ అవుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని  రక్షణ, భద్రతా సిబ్బందికి  ఆదేశాలు  జారీ చేసింది.  ఎన్డీఏ,(నేషనల్ డిఫెన్స్ అకాడమీ),  ఎన్ఐఎ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పేరుతో హానికరమైన  ఈ ఫైల్స్ షేర్ అవుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. . ఈ మేరకు డిసెంబర్ 30న  అప్రమత్తంగా ఉండాల్సిందిగా  రక్షణ మరియు భద్రతా సంస్థలకు  అలర్ట్ జారీ చేసింది.

ముఖ్యంగా  డిఫెన్స్ , సెక్యూరిటీ పారామిలీటరీ, పోలీస్ విభాగంలోని సిబ్బంది (స్త్రీ,పురుషులను) టార్గెట్ చేస్తూ ఈ అనుమానాస్పద ఫైల్స్  సర్క్యులేట్ అవుతున్నాయని  భద్రా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.  ప్రధానంగా ఎక్స్ ఎల్ ఫార్మాట్  లో  ఉన్న ఫైల్ లో  హానికరమైన వైరస్ ను జోడించినట్టు అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా  యూజర్ల వ్యక్తిగత సమాచారంతోపాటు  బ్యాంకింగ్ డేటాను హాక్  చేయొచ్చని తెలిపారు.  వినియోగదారుల ఫోన్ మరియు డేటాపై దాడిచేసే  ఈ వైరస్ మెసేజ్ ల ద్వారా బ్యాంకింగ్ పాస్ వర్డ్స్, పిన్ తదితర వివరాలు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.  ఈ హానికరమైన ఫైల్స్  ఎంఎస్ వర్డ్'  లేదా ' పీడీఎఫ్ ఫార్మాట్లలో  కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని, అప్రమత్తంగా ఉండాలని  అధికారులు హెచ్చరించారు.

దేశీయంగా అంతర్జాతీయ బాగా పాపులర్   సంస్థలు ఎన్ ఐల, ఎన్ డీఏ  ఈ పేరుతో ఈ  సందేశాలు చలామణి అవుతున్నట్టు, దీంతో  యూజర్లు  వీటికి  తొందరగా ఆకర్షితమయ్యే అవకాశం  ఉందని అధికారులు  భావిస్తున్నారు. ఇలాంటి సందేశాలను స్వీకరించిన  సిబ్బంది  వెంటనే  సంబంధిత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  విభాగాలకు రిపోర్ట్ చేయాలని కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు