మోడీ 'అసలుసిసలు రాజకీయాని'కి ప్రతీక

3 Nov, 2013 14:23 IST|Sakshi
మోడీ 'అసలుసిసలు రాజకీయాని'కి ప్రతీక

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిప్పులు చెరిగింది. 'పాట్నా పేలుళ్ల' ఘటనలో మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించి, ఓదార్చడాన్ని పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మోడీ శనివారం బీహార్ పర్యటనను 'అసలుసిసలు రాజకీయాని'కి ప్రతీకగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. గత నెలలో ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో మత ఘర్షణలు చోటు చేసుకుని 60 మందికిపైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఆ ఘర్షణలు చోటు చేసుకున్న ముజఫర్నగర్లో మోడీ ఎందుకు పర్యటించ లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. 

 

ముజఫర్నగర్లో చోటు చేసుకున్న ఆ మత ఘర్షణలకు సంబంధించిన వార్తులు మోడీ కంటికి కనిపించలేదా లేక చెవులకు వినిపించలేదా అని ప్రశ్నల వర్షం కురిపించింది. పాట్నా పేలుళ్ల మృతుల కుటుంబాల మోడీ ఓదార్పు రాజకీయ క్రీడలో భాగమే అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అంతకు మించి ఏమీ లేదని పేర్కొంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇలాంటి రాజకీయాలకు పాల్పడటం చాలా దురదృష్టమని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రషీద్ అల్వీ ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరేంద్రమోడీ నిన్న బీహార్ పర్యటనపై ఆరోపణలు, ప్రశ్నాల పరంపరను సంధించారు.



గత ఆదివారం పాట్నానగరంలో గాంధీ మైదాన్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హూంకార్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పాట్నా నగరంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలను  పరామర్శించేందుకు శుక్రవారం మోడీ బీహార్ చేరుకున్నారు. శనివారం మృతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కోక్క కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును అందజేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు