కష్టాలు తీర్చమంటే ... గ్యాంగ్ రేప్ చేశారు

30 May, 2015 12:44 IST|Sakshi
కష్టాలు తీర్చమంటే ... గ్యాంగ్ రేప్ చేశారు

ఘజియాబాద్ : వితంతువుపై స్వామిజీతోపాటు మరోవ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్ మధురలో చోటు చేసుకుంది. ఘజియాబాద్కు చెందిన మహిళకు ఇటీవల భర్త చనిపోయాడు. దాంతో ఆమె తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుంది. తనకు తెలిసిన ఓ స్వామిని కలిస్తే కష్టాలు తొలగిపోతాయని ఓ వ్యక్తి సదరు మహిళతో నమ్మ బలికాడు. దీంతో ఆమె సదరు వ్యక్తి, కుమారుడితో కలసి మధుర వెళ్లింది. ఆ కష్టాలు తొలగించాలని ఆమె  స్వామిజీని వేడుకుంది.

ఆ క్రమంలో ఆమెపై స్వామిజీ అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమెతో వచ్చిన వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు వెళ్లడిస్తే కుమారుడిని చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు