కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ

17 Mar, 2017 13:47 IST|Sakshi
కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ

పణజి: అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి భగ్గుమంటోంది. హైకమాండ్ తీరు నచ్చక ఇప్పటికే ఒక ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయగా మరో ఎమ్మెల్యే కూడా అదే బాట పట్టారు. రాహుల్ గాంధీని తనకు నాయకుడిగా అంగీకరించబోనంటూ పార్టీకి సావియో రోడ్రిగ్యుస్ రాజీనామా చేశారు. రాణె రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయన పార్టీని వీడడం గమనార్హం.

‘గోవా ఎన్నికల్లో పార్టీ ఓటమికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు(రాహుల్ గాంధీ) బాధ్యత వహించలేదు. దిగ్విజయ్ సింగ్ మాత్రమే నైతిక బాధ్యత వహించార’ని సావియో పేర్కొన్నారు. అధినాయకత్వం అసమర్థతను నిరసిస్తూ విశ్వజీత్‌ రాణె గురువారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గోవా అసెంబ్లీలో నిన్న జరిగిన బలపరీక్షకు ఆయన హాజరుకాలేదు. మనోహర్ పరీకర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇతరుల మద్దతుతో బలపరీక్షలో నెగ్గి కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తీసింది.

మరిన్ని వార్తలు