ఏపీకి హోదా కోసం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు

9 Mar, 2017 03:04 IST|Sakshi
ఏపీకి హోదా కోసం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు

వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం లోక్‌సభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు లోక్‌సభ ఎజెండాలో ఈ బిల్లును తొమ్మిదవ అంశం గా పొందుపర్చారు.

అనాథ పిల్లలకు సాంఘిక భద్రత కల్పించడం లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్, జంతువుల చట్టంలో సవరణలు తేవాలని టీడీపీ ఎంపీ జయదేవ్‌ గల్లా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఉచిత విద్యా చట్టం, 2009లో సవరణలను ప్రతిపాదిస్తూ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డి రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెడతారు. రాజ్యాంగంలో సవరణలను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు కేవీపీ రామచందర్‌ రావు, పాల్వాయి గోవర్ధన రెడ్డి వేర్వేరుగా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు