31 పైసలు బలపడ్డ రుపీ

28 Dec, 2013 01:53 IST|Sakshi
31 పైసలు బలపడ్డ రుపీ

ముంబై: ముందురోజు నష్టాల నుంచి దేశీ కరెన్సీ కోలుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 31పైసలు బలపడి 61.85 వద్ద ముగిసింది. ఎఫ్‌ఐఐల పెట్టుబడులతో దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం వంటి అంశాలు ఇందుకు కారణంగా నిలిచాయి. కాగా, గురువారం ట్రేడింగ్‌లో రూపాయి ఇదే స్ధాయిలో 37పైసలు నష్టపోయిన విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ కరెన్సీలతో మారకంలో డాలరు విలువ క్షీణించడం కూడా రూపాయికి ప్రోత్సాహాన్నిచ్చినట్లు ట్రేడర్లు తెలిపారు. దీంతో గురువారం ముగింపు 62.16తో పోలిస్తే రూపాయి తొలుత 61.97 వద్ద పటిష్టంగా మొదలైంది. ఆపై ఒక దశలో 62.16కు క్షీణించినప్పటికీ చివరికి 0.5% బలపడి ముగిసింది.
 

మరిన్ని వార్తలు