శ్రీమిస్‌ క్వీన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఇండియా–2023 'రన్నరప్‌' గా నిర్మల్‌ యువతి

21 Oct, 2023 08:14 IST|Sakshi
నిషిత తిరునగరి

ఫ్యాషన్‌రంగంపై మక్కువతో

నిర్మల్‌ యువతి అరుదైన స్థానంలో..

ఈద్‌గాంకు చెందిన సరళ, మనోహర్‌స్వామి దంపతుల కూతురు!

18రాష్ట్రాల మహిళలు, యువతులకు ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌డిఫెన్స్‌ కోర్సు..

సాక్షి, ఆదిలాబాద్‌: ఫ్యాషన్‌రంగంపై మక్కువతో అందులో ఎదుగుతున్న నిర్మల్‌ యువతి అరుదైన స్థానంలో నిలిచింది. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన శ్రీమిస్‌ క్వీన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఇండియా–2023శ్రీ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన నిషిత తిరునగరి ఒక్క మార్కు తేడాలో రన్నరప్‌గా నిలిచింది. స్థానిక ఈద్‌గాంకు చెందిన సరళ, మనోహర్‌స్వామి దంపతుల కూతురు నిషిత బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివింది. భవిష్యత్తుపై తనకున్న నమ్మకం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఫ్యాషన్‌రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె 18రాష్ట్రాల మహిళలు, యువతులకు ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌డిఫెన్స్‌ కోర్సును నేర్పిస్తుండడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన పోటీల్లో నిషిత రన్నరప్‌గా నిలువడంపై కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని

మరిన్ని వార్తలు