ప్లాస్టిక్‌ వ్యర్థాల వినియోగంపై వర్క్‌షాప్‌ | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వ్యర్థాల వినియోగంపై వర్క్‌షాప్‌

Published Sat, Oct 21 2023 1:58 AM

కార్యక్రమంలో పాల్గొన్న వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ
 - Sakshi

భైంసా: ప్లాస్టిక్‌వ్యర్థాల వినియోగంపై హైదరా బాద్‌లోని గచ్చిబౌలిలో శుక్రవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌తోపాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నా రు. బాసర ట్రిపుల్‌ఐటీ, ఎన్వీరాల్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ప్లాస్టి క్‌ వ్యర్థాల వినియోగంపై అవగాహన కల్పించా రు. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వాహణ సముద్ర కా లుష్యం, బయోమైనింగ్‌ టోర్‌ఫాక్షన్‌, బయోమెడికల్‌, వ్యర్థాలతో ఎదురయ్యే సవాళ్లపై వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ మార్గనిర్దేశం చేశారు. ఈ వర్క్‌షాపులో అధ్యాపకులు డాక్టర్‌ వినోద్‌, రామేశ్‌రెడ్డి, సృజన, నరేందర్‌, రాహుల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement