ఐటీడీఏ స్పందనలో 71 వినతుల స్వీకరణ

21 Nov, 2023 01:18 IST|Sakshi
వినతులను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే, సబ్‌కలెక్టర్‌ శుభం బన్సల్‌

రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనలో 71 వినతులు సీకరించినట్టు పీవో సూరజ్‌ గనోనే, సబ్‌ కలెక్టర్‌ శుభం భన్సల్‌ తెలిపారు. వృద్ధాప్య పింఛను, రేషన్‌ మంజూరు చేయాలని వై.రామవరం మండలం అంటిలోవ గ్రామానికి చెందిన పల్లాల లక్ష్మమ్మ వినతి అందజేసింది. పాలగడ్డ గ్రామం నుంచి గొర్రలోడు వరకు సుమారు ఏడు కిలోమీటర్ల రహదారికి మరమ్మతులు చేపట్టాలని సారంకోట అబ్బాయి రెడ్డి అధికారులను కోరారు. రంపచోడవరం మండలం ఐ.పోలవరంలో 400 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు సరిగ్గా పనిచేయడం లేదని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేయాలని బంధం పోతున్నదొర, కంగల సూర్యారావు, కంగల కన్నయ్య దొర కోరారు. వై.రామవరంలో సర్వేనెంబర్‌ 71/1లో భూసమస్య పరిష్కరించాలని కోటం లక్ష్మయ్య, ముర్ల సూరిబాబు దరఖాస్తు అందజేశారు. వై. రామవరం మండలం చింతలపూడి పంచాయతీలోని రైతులకు సాగునీరు అందించే కన్నీరు వాగులో పూడికతీతకు చర్యలు తీసుకోవాలని, బొడ్డగుంట, చింతకొయ్య గ్రామాల మధ్యలో కాలువపై బ్రిడ్జి నిర్మించాలని చింతలపూడి ఉపసర్పంచ్‌ పల్లాల లచ్చిరెడ్డి, కత్తుల ఆది రెడ్డి అధికారులను కోరారు. వీటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని పీవో సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డీఎస్‌ శాస్త్రి, డివిజనల్‌ పంచాయతీ అధికారి రాఘవన్‌, ఏడీఎంహెచ్‌వో జి. ప్రకాశం, ఏపీడీ వెలుగు ఎ. శ్రీనివాసరావు, పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ షరీఫ్‌, వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చౌదరి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు జి. డేవిడ్‌ రాజ్‌, ఎండీ యూసఫ్‌, సుబ్బయ్య, పీఏవో రాంబాబు, పీహెచ్‌వో చిట్టిబాబు, డాక్టర్‌ ఇందిర, సీడీపీవో సంధ్యారాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు సాయి సతీష్‌, రాజేంద్ర బాబు, శ్రీరామచంద్రమూర్తి, ఏపీ ఈపీడీసీఎల్‌ డీఈ మల్లికార్జునరావు, ఎంఈవో సి. శ్రీహరి, పశుసంవర్ధక వైద్యాధికారి గోపిక, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ బి. కిషోర్‌, లీగల్‌సెల్‌ న్యాయవాది సత్యనారాయణ పాల్గొన్నారు.

సత్వర పరిష్కారానికి చర్యలు

రంపచోడవరం పీవో సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌

మరిన్ని వార్తలు