పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

21 Nov, 2023 01:18 IST|Sakshi
కాటేజీలను ప్రారంభిస్తున్న మధుసూదనరెడ్డి
ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మధుసూదనరెడ్డి

మారేడుమిల్లి : ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మధుసూదనరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మారేడుమిల్లిలో పర్యటించిన ఆయన వనవిహారి వద్ద రూ.22 లక్షలతో విహారి కాటేజ్‌, బేంబో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అనంతరం రంపచోడవరం, చింతూరులో రూ.1.50 కోట్లతో నిర్మించినున్న డీఎఫ్‌వో కార్యాలయ భవనాలకు మారేడుమిల్లి నుంచి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. వనవిహారిలో నూతనంగా నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యటకంగా మారేడుమిల్లి అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు ఏటా అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారన్నారు. అందుకు తగ్గట్టుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్జర్వేటర్‌ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌వో జీజీ నరేంథిరన్‌, స్క్వాడ్‌ డీఎఫ్‌వో త్రిమూర్తులు రెడ్డి, రంపచోడవరం, అడ్డతీగల సబ్‌ డీఎఫ్‌వోలు శ్రీవాణి, శ్రీ రామారావు, రేంజ్‌ అదికారులు అజాత్‌, శ్రీసాయి, కరుణాకర్‌, అబ్బాయి రెడ్డి, ఉషారాణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు