సరకు రవాణాలో ‘వాల్తేరు’ సూపర్‌ హిట్‌.!

23 Mar, 2023 01:16 IST|Sakshi
బొగ్గు రవాణా
● వార్షిక సంవత్సరం ముగియకుండానే చేరుకున్న లక్ష్యం ● 2022–23 మార్చి 20 నాటికి 66.92 మిలియన్‌ టన్నుల లోడింగ్‌

సాక్షి, విశాఖపట్నం : వాల్తేరు డివిజన్‌.. ఏటా మాదిరిగానే ఈసారి కూడా సరకు రవాణాలో సూపర్‌హిట్‌ కొట్టింది. సరకు రవాణా విషయంలో గణనీయంగా వృద్ధి సాధిస్తూ 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ముందుగానే దాటేసింది. మార్చి 20 నాటికి రికార్డు స్థాయిలో 66.92 మిలియన్‌ టన్నుల లోడింగ్‌ సామర్థ్యాన్ని చేరుకుంది. బొగ్గు, ఐరన్‌ ఓర్‌, బాకై ్సట్‌, అల్యుమినా పౌడర్‌, ఐరన్‌ స్టీల్‌, లైమ్‌స్టోన్‌, ఫెర్టిలైజర్స్‌, పోల్‌, కంటైనర్లుతో పాటు ఇతర సరకుల లోడింగ్‌తో ఈ రికార్డు లోడింగ్‌ సాధ్యమైంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాల్తేరు డివిజన్‌ చరిత్రలోనే రికార్డు సాధించేలా 70 మిలియన్‌ టన్నులకు చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

డివిజన్‌ పరిధిలో లోడింగ్‌ ఇలా...

2020–21 ఆర్థిక సంవత్సరంలో – 61.17 మిలియన్‌ టన్నులు

2021–22లో –

66.88 మిలియన్‌ టన్నులు

2022–23లో–

66.92 మిలియన్‌ టన్నులు

2022–23లో ఇప్పటి వరకూ

జరిగిన సరకు రవాణా వివరాలు

బొగ్గు – 25.42 మిలియన్‌ టన్నులు

ఐరెన్‌ ఓర్‌ – 17.63 మి.ట.

బాకై ్సట్‌ – 5.75 మి.ట.

అల్యుమినా పౌడర్‌ – 3.6 మి.ట.

ఫెర్టిలైజర్స్‌ – 2.91 మి.ట.

ఐరన్‌ అండ్‌ స్టీల్‌ – 2.43 మి.ట.

పోల్‌ – 1.51 మి.ట.

కంటైనర్లు – 1.37 మి.ట.

ఇతర సరకులు – 6.3 మి.ట.

మరింత వృద్ధి సాధిస్తాం

రకు రవాణా విషయంలో రికార్డు స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉంది. ఇది వాల్తేరు డివిజన్‌లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కృషికి దక్కిన ఫలితం. ప్రయాణికుల మౌలిక సదుపాయాల విషయంలో గానీ, సరకు రవాణా విషయంలోనూ డివిజన్‌ ఎక్కడా రాజీపడటం లేదు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాం. నిర్దేశించిన సమయానికి ఆయా సంస్థలకు సరుకు లోడింగ్‌ చేస్తుండటంతో డివిజన్‌పై విశ్వాసం పెరుగుతోంది. రాబోయే రోజుల్లోనూ మరిన్ని రికార్డులు సొంతం చేసుకునే దిశగా.. ప్రతి ఒక్క ఉద్యోగి అంకిత భావంతో పనిచేస్తున్నారు.

– అనూప్‌కుమార్‌ సత్పతి, వాల్తేరు డీఆర్‌ఎం

మరిన్ని వార్తలు