కడుపునొప్పితో ఆశ్రమ విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

కడుపునొప్పితో ఆశ్రమ విద్యార్థి మృతి

Published Thu, Mar 23 2023 1:16 AM

విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ప్రజా సంఘాల నేతలు  - Sakshi

ముంచంగిపుట్టు: కడుపు నొప్పితో బాధపడుతున్న ఆశ్రమ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–2లో 5వ తరగతి చదువుతున్న కొర్రా కిరణ్‌(10)కు గత కొద్ది రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి కడుపు నొప్పి ఎక్కువ అవ్వడంతో వార్డెన్‌ స్థానిక సీహెచ్‌సీకి హూటహూటిన తరలించారు. స్థానిక వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడి నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విద్యార్థి కిరణ్‌ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని స్వగ్రామం బాబుశాల పంచాయతీ బల్లుగూడకు తరలించారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం నేతలు నరసయ్య, ఎంఎం శ్రీను, భీమరాజు, గాసిరాందొర బల్లుగూడ వెళ్లారు. విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లంచాలని, ఆశ్రమ పాఠశాలలో హెల్త్‌ వలంటీర్‌గా నియమించాలని డిమాండ్‌ చేశారు. ఆశ్రమ పాఠశాల అధికారులు నిర్లక్ష్యంవల్లే విద్యార్థి కిరణ్‌ మృతి చెందడాని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు.

విద్యార్థి కిరణ్‌ మృతదేహం
1/1

విద్యార్థి కిరణ్‌ మృతదేహం

Advertisement
Advertisement