Sakshi News home page

‘టీడీపీకి రాజకీయ సమాధి ఖాయం’

Published Sat, Nov 18 2023 12:28 AM

ఎమ్మెల్యే  గణేష్‌  - Sakshi

నర్సీపట్నం: రాబోయే ఎన్నికల్లో టీడీపీని రాజకీయంగా సమాధి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ తెలిపారు. శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టారని చెప్పారు. ఈ సారి ఏకంగా సమాధి చేయడం ఖాయమన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. నాడు–నేడు, అమ్మ ఒడి పథకాలపై అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను ఖండించారు. తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉండేవో..సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏవిధంగా ఉన్నాయో అయ్యన్నపాత్రుడు కళ్లు పెట్టి చూ డాలని హితువు పలికారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. నియోజకవర్గంలో 232 పాఠశాలలు ఉంటే మొదటి విడతలో 89 పాఠశాలలు, రెండవవిడతలో 103 పాఠశాలలను రూ.73 కోట్లతో ఆధునికీకరించామన్నారు. అమ్మఒడి పథకం కింద నాలుగు దఫాల్లో నియోజకవర్గంలో 27 వేల మందికి తల్లుల ఖాతాల్లో రూ.169 కోట్లు జమచేశామని చెప్పారు. చంద్రబా బు పేరు చెబితే స్కామ్‌ లు గుర్తొస్తాయని, జగన్‌మోహన్‌రెడ్డి పేరు చెబితే స్కీమ్‌లు గుర్తొస్తున్నాయని తెలి పా రు. అయ్యన్నపాత్రుడు ఎన్నో అక్రమా లు చేశారన్నా రు. రంగురాళ్లు తవ్వకాలు, లేటరైట్‌, ఇసుక, లిక్కర్‌లో కోట్లరూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎంను చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement