మత్స్యకారులకు దొరికిన వాయుసేన మిస్సైల్‌

9 Dec, 2023 05:15 IST|Sakshi

సూర్యలంక మిలిటరీ ఎయిర్‌ఫోర్సు అధికారులకు అప్పగింత  

వేటపాలెం: మత్స్యకారుల వలకు మిలిటరీ వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్‌ దొరికింది. ఈ ఘటన శుక్రవారం బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో చోటుచేసుకుంది. దాన్ని మత్స్యకారు­లు బోటులో ఒడ్డుకు తీసుకొచ్చారు. మెరైన్‌ ఎస్‌ఐ సుబ్బారావు బాపట్ల సూర్యలంకకు చెందిన ఎయిర్‌ఫో­ర్సు మిలిటరీ అధికారులకు సమాచారం అందించారు.  

ఏం జరిగిందంటే... 
సూర్యలంకకు చెందిన మిలటరీ అధికారులు ఏటా ఎయిర్‌ఫోర్సుకు చెందిన రిహార్సల్స్‌ నిర్వహిస్తుంటారు. ఈనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సముద్ర గగనతలంలో అడ్వాన్స్‌డ్‌  మిస్సైల్‌ సిస్టంపై రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. చిన్నపాటి యుద్ధ మిస్సైల్‌ను ప్రయోగించి అది లక్ష్యం చేరుకోక ముందే సూర్యలంక కేంద్రం నుంచి పేట్రియాట్‌ మిస్సైల్‌తో దాన్ని పేల్చివేసే రిహార్సల్స్‌ జరుగుతున్నాయి. దీన్లో భాగంగా ప్రయోగించిన ఈ మిస్సైల్‌ సముద్రంలో మత్స్యకారులకు దొరికింది. దాన్ని మెరైన్‌ అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్సు అధికారులకు అప్పగించారు.

>
మరిన్ని వార్తలు