హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు

7 Dec, 2021 03:55 IST|Sakshi

జస్టిస్‌ కుంభజడల మన్మధరావు, జస్టిస్‌ బొడ్డుపల్లి శ్రీ భానుమతి నియామకం

సాక్షి అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ డాక్టర్‌ కుంభజడల మన్మధరావు, జస్టిస్‌ బొడ్డుపల్లి శ్రీ భానుమతి నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్రం వీరి నియామకాలను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ వారంలో వీరు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరిద్దరి నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరనుంది.

న్యాయమూర్తుల నేపథ్యం ఇది..
న్యాయమూర్తి జస్టిస్‌ కుంభజడల మన్మధరావు
జననం: 1966, జూన్‌ 30
ఊరు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ
విద్యాభ్యాసం: ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, డాక్టరేట్‌

ప్రస్థానం: 
► 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఒంగోలులో నాగిశెట్టి రంగారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 
► 1999లో హైకోర్టుకు ప్రాక్టీస్‌ మార్చారు. 
► ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వంటి కీలక సంస్థలకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 
► పలు బ్యాంకులకు న్యాయ సలహాదారుగా ఉన్నారు.

న్యాయమూర్తి జస్టిస్‌ బొడ్డుపల్లి శ్రీ భానుమతి
స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు
విద్యాభ్యాసం: రాజమహేంద్రవరంలో ‘లా’ అభ్యసించారు.

ప్రస్థానం: 
► న్యాయాధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. 
► 2020 జూన్‌లో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమితులయ్యారు. తొలి మహిళా రిజిస్ట్రార్‌ జనరల్‌ భానుమతి కావడం విశేషం. అప్పటి నుంచి అదే పోస్టులో కొనసాగుతున్నారు.   

మరిన్ని వార్తలు