డాక్టర్లు కాన్సర్‌ అన్నారు.. ఆరోగ్యశ్రీ అండగా నిలిచింది

4 Dec, 2023 09:40 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

మా తల రాత మారింది 
ఇంటి కోసం టీడీపీ పాలనలో కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదిగో.. ఈ ప్రభుత్వం వచ్చాక మా కల సాకారమైంది. మాది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామం. నా భర్త పేరు బంగారయ్య. మాకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద పాప మూడో తరగతి, చిన్న పాప ఎల్‌కేజీ చదువుతున్నారు. మాది నిరుపేద కుటుంబం. ఇతర ఆస్తులు ఏమీ లేవు. నా భర్త బంగారయ్య ఆనందపురం జంక్షన్‌లో ఆటో మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

మాకు 2013లో వివాహమైంది. మాకు సొంతిల్లు లేక పోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నాము. ఒక వైపు ఇంటికి అద్దె చెల్లించుకుంటూ, మరో వైపు కుటుంబాన్ని పోషించుకోవలసి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారం. చంద్రబాబు హయాంలో ఐదుసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. మా ఖర్మ ఇంతే అనుకొని తీవ్ర నిరాశతో ఉన్నాం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత మా రాత మారిపోయింది. దరఖాస్తు చేసిన వెంటనే సుమారు రూ.10 లక్షల విలువ చేసే స్థలాన్ని మంజూరు చేశారు. 

సిమెంట్, ఇసుక ఇచ్చారు. మొత్తంగా రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. మా వద్ద ఉన్న కొంత పొదుపు సొమ్ముతో ఇంటిని నిర్మించుకున్నాం. దీంతో మా సొంతింటి కల నెరవేరింది. అద్దె లేక పోవడంతో సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతోంది. నా కుమారుడికి అమ్మ ఒడి కింద ఏటా డబ్బు వస్తోంది. ఇంటికే రేషను తెచ్చి ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడం వలన ఏమాత్రం అనారోగ్యానికి గురైనా ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నాము.   


– పిన్నింటి రామలక్ష్మి (మహంతి శివాజీ, విలేకరి, ఆనందపురం) 

ఆరోగ్యశ్రీ లేకపోయుంటే జీవితమే లేదు 
మాకు వచ్చే ఆదాయం ఇంటి అద్దెకు, పిల్లల చదువులకే సరిపోదు. అలాంటి పరిస్థితిలో కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన నేను ఆస్పత్రికి వెళ్లాను. వైద్యులు పరీక్షించి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అని చెప్పారు. ఆపరేషన్‌ చేయాలంటే రూ.15 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దీంతో మా కుటుంబంపై పిడుగు పడ్డట్లయింది. ఆపరేషన్‌ చేయించుకోగలమా? అని బాధపడ్డాము. అప్పుడు వైద్యులు మీకు రూపాయి ఖర్చు కాదు.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో ఆపరేషన్, మందులు అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది అని చెప్పారు. అన్నట్లుగానే రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్‌ చేయడంతోపాటు ఉచితంగా మందులు ఇచ్చారు. చికిత్స అనంతరం వారే మా ఇంటి వద్ద దించారు. ఇప్పటికీ మందులు అందజేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే నాకు జీవితమే లేదు. జగనన్న పుణ్యమా.. అని మా కుటుంబం సంతోషంగా ఉంది. నా పేరు షేక్‌ సాజిదా. నా భర్త షేక్‌ ఇస్మాయిల్‌ టీ కొట్టులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు రహమాన్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం, కుమార్తె తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ఇదివరకు ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఒకరిని స్కూలు మాని్పంచి కూలికి పంపుదామని అనుకున్నాము. ఇప్పుడు ఆ కష్టం లేదు. అమ్మ ఒడితో పాటు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు, బట్టలు, బూట్లు.. అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. స్కూల్లోనే మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నారు. ఈ ప్రభుత్వం నుంచి మా కుటుంబానికి ఇంతగా మేలు జరుగుతుందని ఊహించలేదు.  


 – షేక్‌ సాజిదా, టిప్పర్ల బజారు, మంగళగిరి  (ఐ.వెంకటేశ్వరరెడ్డి, విలేకరి, మంగళగిరి) 

దివ్యాంగ పింఛనుతో బడ్డీ కొట్టు పెట్టుకున్నా
మాది చిన్న కుటుంబం. భార్య, ముగ్గురు పిల్లలు. ఆరి్థకంగా అంతంత మాత్రమే. చిన్న హోటల్‌ నడుపుకుంటూ బతుకు బండి లాగుతుండేవాడిని. 2019లో నాకు పక్షవాతం వచి్చంది. దీంతో ఏ పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. లేచి నిలబడడానికి కూడా శరీరం సహకరించేది కాదు. నా భార్యే కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచి్చంది. కొన్నాళ్లకు వాకర్‌ సహాయంతో నెమ్మదిగా నిలబడడం, చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతున్నాను. 90 శాతం వికలాంగత్వం ఉండటంతో నాకు దివ్యాంగుల పింఛను మంజూరైంది. 2021 నుంచి నెలకు 5 వేల రూపాయలు అందుకుంటున్నాను. నా కుమారుడికి  ట్రిపుల్‌ ఐటీలో సీటు వచ్చింది. ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. నా కుమార్తె బీటెక్‌ సెకండియర్‌ చదువుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుండడంతో ఫీజుల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాలేదు. నా భార్యకు కూడా కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15 వేలు అందుతున్నాయి. నా భార్య కూలి పనుల సంపాదన, నాకు వచ్చే పింఛను డబ్బులపై ఆధారపడకుండా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులోని మా ఇంటి దగ్గరే బడ్డీ దుకాణం పెట్టుకున్నా. మా జీవితంలో ఇంత మార్పు వస్తుందని, ప్రభుత్వం నుంచి ఇలా సాయం అందుతుందని ఊహించలేదు.


– శిఖినం సుధాకర్, భట్టిప్రోలు  (నందం వెంకటేశ్వరరావు, విలేకరి, భట్టిప్రోలు)  

>
మరిన్ని వార్తలు