పోషకాహారం అందజేతలో ఏపీ అగ్రగామి 

11 Nov, 2022 05:39 IST|Sakshi
ఉయ్యూరు సివిల్‌ సప్లయ్స్‌ గోదాములో సరుకులను పరిశీలిస్తున్న విజయ ప్రతాప్‌రెడ్డి

ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాప్‌రెడ్డి  

ఉయ్యూరు: ప్రజలకు పోషకాహారం అందించడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సీహెచ్‌ విజయ ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఫుడ్‌ కమిషన్‌ రాష్ట్ర బృందం గురువారం కృష్ణా జిల్లా ఉయ్యూరులో పర్యటించింది. కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యూరు జెడ్‌పీ పాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిని పదార్థాల నాణ్యతను తెలుసుకున్నారు.

నాడు–నేడు కింద పాఠశాలలో చేపట్టిన ప్రగతిని పరిశీలించి పనుల నాణ్యతను తనిఖీ చేశారు. మార్కెట్‌ యార్డు ప్రాంగణంలోని పౌరసరఫరాల గోదామును సందర్శించి సరుకుల నాణ్యత పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. కడవకొల్లు–కాటూరు మధ్య అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కోళ్లఫారంను సందర్శించారు. విజయ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు పథకాలను అందించాలన్నారు.   

మరిన్ని వార్తలు