ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు లైన్‌ క్లియర్‌

8 Oct, 2021 07:50 IST|Sakshi

శాశ్వతంగా తమ రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు తమ రాష్ట్రానికి శాశ్వతంగా వెళ్లేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. తెలంగాణ స్థానికత, భార్య లేదా భర్త ఆ రాష్ట్రంలో పనిచేస్తుండటం, అనారోగ్యం తదితర కారణాలున్నవారిని తెలంగాణకు బదిలీ చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత నమూనా మేరకు వచ్చే నెల 7లోగా సంబంధిత శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.
చదవండి: పెద్దమనసు చాటుకున్న కేటీఆర్‌  
190 అసిస్టెంటు ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

మరిన్ని వార్తలు