విశాఖ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ 

24 Sep, 2023 05:39 IST|Sakshi

సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి వెల్లడి  

సాక్షి, విశాఖపట్నం : నీతి ఆయోగ్‌ గ్రోత్‌ హబ్స్‌ జాబితాలో విశాఖ ఎంపికైన నేపథ్యంలో అభివృద్ధికి అవసరమైన భవిష్యత్‌ ప్రణాళికల్ని రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ, టూరి జం ఆర్‌డీ శ్రీనివాస్‌పాణి, మెట్రోరైల్‌ ఎండీ యూజేఎం రావు తదితరులతో మాట్లాడారు. విశాఖ అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్‌ ప్రణాళికలపై ప్ర త్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.

మెట్రో రైలు ప్రాజెక్టు నాలుగు విభాగాలుగా రూ పొందుతోందని మెట్రో ఎండీ యూజేఎంరావు తెలిపారు.  లైట్‌ కారిడార్, మోడరన్‌ కారిడార్‌ పేర్లతో రూపొందుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని జవహర్‌రెడ్డి సూచించారు. జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అర్బన్‌ గ్రోత్‌ హబ్‌ సిటీస్‌ జాబితాలో విశాఖ చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు.

2047 నాటి కి వికసిత్‌ భారత్‌గా వెలుగొందాలంటే అర్బన్‌ సిటీ స్‌ గ్రోత్‌ సెంటర్స్‌ ముఖ్యమని నీతి ఆయోగ్‌ గుర్తించిందని తెలిపారు. ఇందుకోసం నీతి ఆయోగ్‌ బృందం టోక్యో, న్యూయార్క్‌ వంటి 20 ప్రపంచస్థాయి నగరాల్ని అధ్యయనం చేసి రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చే సిందని, ఇందులో భాగంగా విశాఖని ఎంపిక చేసిందని వివరించారు. విశాఖ నుంచి సీఎం పరిపాలనపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు