అంబేద్కర్‌ కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన..

26 Jul, 2022 21:45 IST|Sakshi

05: 30PM
రాజోలు మండలం మేకలపాలెంలో సీఎం జగన్‌ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను గ్రామస్తులు సీఎం దృష్టికి తీసుకురాగా.. సమస్యలన్నింటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

04: 10PM
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం మేకలపాలెంకు సీఎం జగన్‌ చేరుకున్నారు. కరకట్టవాసి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. మేకలపాలెంలో ఏటిగట్టును పరిశీలించారు.

03: 30PM
కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాడ్రేవుపల్లికి చేరుకున్నారు. కాసేపట్లో రాజోలు మండలం మేకలపాలెంకు వెళ్లనున్నారు. అక్కడ వరద బాధితులను సీఎం పరామర్శించనున్నారు.

02: 30PM
అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను నేరుగా కలిసి పరామర్శిస్తున్నారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.

12: 58PM
అరిగెలవారిపేటకు చేరుకున్న సీఎం జగన్‌

అరిగెలవారిపేట వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌

అరిగెలవారిపేటలో వంతెన నిర్మిస్తానని సీఎం జగన్‌ హామీ

12:01PM
పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ

నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్‌

సీఎం జగన్‌ జేబులోంచి పెన్‌ తీసుకున్న 8 నెలల బాబు

8 నెలల బాబుకు తన పెన్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్‌

శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను అడిగిన సీఎం జగన్‌

కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చని అడిగిన సీఎం జగన్‌

వాలంటీర్లు బాగా పనిచేశారని సీఎంకు చెప్పిన వరద బాధితులు

11: 20AM
ట్రాక్టర్‌లో లంక గ్రామాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్‌

11:15AM
పంటుపై లంక గ్రామాలకు చేరిన సీఎం జగన్‌

11: 06 AM
పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్తున్న సీఎం జగన్‌

10:34 AM
పి.గన్నవరం మండలం జి. పెదపూడి చేరుకున్న సీఎం జగన్‌

జి. పెదపూడిలో కురుస్తున్న భారీ వర్షం

వర్షంలోనే వరద బాధితులకు వద్దకు సీఎం జగన్‌

9: 45AM
డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌

► అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. 

అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు.

► అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు. 

► అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుని.. వరద బాధితులతో సమావేశం అవుతారు. 

► అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. 

► రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్‌ బస చేయనున్నారు.

వరద బాధితుల పరామర్శ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. డా.బీ.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు