ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రధానితో కీలక భేటీ

21 Aug, 2022 21:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి 9:30 ప్రాంతంలో ఢిల్లీ చేరుకున్నారు. జన్‌పథ్‌-1లోని నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రధానితో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనే ప్రధాన లక్ష్యంగా భేటీలో చర్చకు రానుంది. అలాగే, నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని కోరనున్నారు సీఎం జగన్‌.  విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను అమలు చేయాలని సీఎం కోరనున్నారు.   

మరిన్ని వార్తలు