చిత్తూరు వనిత జీవితం మనందరికీ ఆదర్శం.. సీఎం జగన్ ట్వీట్..

8 Mar, 2023 18:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్.  జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన వనిత గారి జీవితం మనందరికీ ఆదర్శం అంటూ ట్వీట్ చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన వనిత తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచారంటూ కొనియాడారు.  వనితతోపాటు మహిళాలోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వీడియోలో వనిత ఏం చెప్పారంటే..
వివాహమయ్యాక ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో భర్తతో తనకు గొడవలు అయ్యి పుట్టింటికి వెళ్లిపోయినట్లు టీ వనిత తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం తనపైనే పడిందన్నారు. కష్టాల్లో ఉన్న తనకు వలంటీర్ ఉద్యోగం ఇప్పించారని పేర్కొన్నారు. ఆసరా డబ్బులు, సున్నా వడ్డీ డబ్బులు, అమ్మఒడి డబ్బులు అన్నీ అందుతున్నాయని వివరించారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తన జీవితంలో సీఎం జగన్ వెలుగులు నింపారని చెప్పారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
చదవండి: మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కొలమానం: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు