వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం

14 May, 2021 22:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేటగిరి-1 అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచగా, కేటగిరి-2 అర్చకులకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచారు. ఇమామ్‌లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు, మౌజంలకు గౌరవ వేతనం రూ.3 వేల నుంచి 5 వేలకు పెంచారు. పాస్టర్లకు రూ.5 వేలు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

( చదవండి: ఏపీ: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో గణనీయ పురోగతి

మరిన్ని వార్తలు