అక్టోబర్‌ నుంచే దేశంలో బొగ్గు కొరత: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్‌

10 Apr, 2022 16:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: గత ఏడాది అక్టోబర్‌ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్‌ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఎక్కడా బొగ్గు సరఫరాకు డబ్బు కొరత లేదు. సమయానికి చెల్లింపులు చేస్తున్నాం. కోల్ ఇండియా వాళ్లకు రూ.150 కోట్లు నిన్న చెల్లించాం. హిందూజకు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. విద్యుత్ వినియోగం 14 శాతానికి పెరిగింది. దీనికి తోడు బొగ్గు కొరత ఏర్పడింది. సెకితో 2024 వరకు ప్రభుత్వం 7 వేల మెగావాట్ల కోసం ఒప్పందం ఉంది. ఇది రాష్ట్రంలోని 19 లక్షల బోర్లకు ఉపయోగిస్తున్నాము.

2014-15 వరకు డిస్కంలు తెచ్చిన రుణాలు రూ.30 వేల కోట్లు ఉన్నాయి. 2018-19కి ఇవి రూ.62 వేల కోట్లకు పెరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు పెరిగాయి. 2019 నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక డిస్కమ్‌లకు 36 వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. బొగ్గు, వినియోగం పెరగడం వల్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. నెలాఖరుకి సమస్య పరిష్కారం అవుతుంది' అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్‌ అన్నారు.

చదవండి: (మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపై బొత్స కీలక వ్యాఖ్యలు) 

మరిన్ని వార్తలు