తిరుపతి రుయా అంబులెన్స్‌ దందాపై ప్రభుత్వం సీరియస్‌

26 Apr, 2022 17:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి రుయా అంబులెన్స్‌ దందాపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే సీఎస్‌ఆర్‌ఎంవో సరస్వతీ దేవిని ప్రభుత్వం సస్పెన్షన్‌ చేసింది. రుయా సూపరిండెంట్‌ భారతికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. మరో వైపు అంబులెన్స్‌ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఆర్డీఓ, డీఎంహెచ్‌వో, డీఎస్పీ బృందంతో కమిటీ వేసింది.  అంబులెన్స్‌ అడ్డుకున్న నలుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

చదవండి👉: తిరుపతి రుయాలో దారుణం.. రెచ్చిపోతున్న అంబులెన్స్‌ దందా..

ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా బయటి అంబులెన్స్‌లను మరో మాఫియా రానివ్వడంలేదు. సిండికేట్‌గా మారి డెడ్‌బాడీ తరలించకుండా మాఫియా అడ్డుకుంది. ఈ ఘటన మొత్తాన్ని ప్రైవేట్‌ అంబులెన్స్‌కు చెందిన నందకిషోర్‌ వీడియో తీశాడు. ప్రైవేట్‌ అంబులెన్స్‌ల ఆగడాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే వీడియో తీశానని తెలిపాడు.

తక్కువ ధరకు అంబులెన్స్‌ సర్వీసు ఇస్తున్నా.. తమను రాన్విడం  లేదని మండిపడుతున్నాడు. తమకు 10 అంబులెన్స్‌లు ఉన్నాయి. మా అంబులెన్స్‌లను ఆసుపత్రి లోపలకి రానివ్వడంలేదని ఆయన అన్నారు. మృతదేహాన్ని తరలించాలంటే రూ.20వేలు డిమాండ్‌ చేస్తున్నారని, వీళ్ల ఆగడాలు తెలియాలనే వీడియో తీశానన్నాడు. ఇందులో ఎటువంటి దురుద్దేశ్యం లేదన్నారు. దీన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని నంద కిషోర్‌ మండిపడ్డాడు.

మరిన్ని వార్తలు