‘లెడ్‌ స్థాయిని తగ్గించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి’

12 Jul, 2021 21:13 IST|Sakshi

ఏపీ హైకోర్టు

సాక్షి, అమరావతి: అమర్‌రాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీలో లెడ్‌ స్థాయిని తగ్గించేలా వెంటనే యాజమాన్యం చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అమర్‌రాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీలో కాలుష్యం, పీసీబీ ఆదేశాలపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా.. అమర్‌రాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదకరస్థాయిలో లెడ్‌ ఉందని పేర్కొంది. గాలిలో, నీటిలో, భూమిలో లెడ్‌ ఉందని, దాన్ని తగ్గించకపోతే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తేల్చిచెప్పింది. 

మరిన్ని వార్తలు