ఏపీలో ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్

8 Apr, 2021 19:00 IST|Sakshi

Time: సాయంత్రం 5 గంటలు
ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.42 శాంతం పోలింగ్‌ నమోదైంది.

Time: సాయంత్రం 4 గంటలు
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది.
శ్రీకాకుళం జిల్లా-46.46 శాతం
విజయనగరం జిల్లా-56.57 శాతం
విశాఖ జిల్లా- 55.29 శాతం
తూర్పు గోదావరి- 51.64 శాతం
పశ్చిమగోదావరి జిల్లా-55.4 శాతం
కృష్ణా జిల్లా-49 శాతం
గుంటూరు జిల్లా- 37.65 శాతం
ప్రకాశం జిల్లా- 34.19 శాతం
నెల్లూరు జిల్లా -41.8 శాతం
చిత్తూరు జిల్లా-50.39 శాతం
వైఎస్సార్‌ జిల్లా- 43.77 శాతం
కర్నూలు జిల్లా-  48.40శాతం
అనంతపురం జిల్లా: 45.70 శాతం

Time: మధ్యాహ్నం 1.30 గంటలు
ఏపీ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
► విశాఖపట్నం: కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలో అరకు పార్లమెంటు సభ్యరాలు ఎంపీ గోడ్డేటి మధవి ఓటు హక్కు వినిమెగించుకున్నారు.
► కర్నూలు: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయ కర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
► విశాఖపట్నం: చోడవరం మండలం అంబేరుపురం పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Time: మధ్యాహ్నం 1.00 గంట
ఏపీలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌  కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు.
► అనంతపురం: తోపుదుర్తి గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
► తూర్పుగోదావరి: తుని మండలం ఎస్‌.అన్నవరం జీపీహెచ్‌ స్కూల్‌లో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
► కృష్ణా : గన్నవరం బాలుర హైస్కూల్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
► శ్రీకాకుళం: చంద్రబాబు నిర్ణయాన్ని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ధిక్కరించారు. ఆయన తన భార్య ఇందిరతో కలిసి మాతల గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తూరు మండలం మాతలలో టీడీపీ ఎంపీటీసీగా కలమట ఇందిర పోటీ చేశారు.

Time: మధ్యాహ్నం 12.30 గంటలు
►  శ్రీకాకుళం: పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఆమె కుటుంసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
►  శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ధానిక సంస్ధల ఎన్నికలు చాల శక్తివంతమైనవి అని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసే పెద్ద ప్రక్రియలో ఓటు చాల ముఖ్యమైనదని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకొఇవాలన్నారు. ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన తీర్పుకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని గుర్తు చేశారు.

► గుంటూరు: పెదనందిపాడు మండలం రాజుపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై టీడీపీ వర్గీయులు దాడికి తెగపడ్డారు. పోలింగ్ బూత్ వద్ద నిలబడి ఓటర్లకు తెలుగుదేశం పార్టీకి ఓటేయమని టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీంతో టీడీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు గాయపడ్డారు. 

Time: మధ్యాహ్నం 12 గంటలు
ఏపీలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌  కొనసాగుంతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా పోలింగ్‌ నమోదు శాతాలు
శ్రీకాకుళం జిల్లాలో 19.32 శాతం పోలింగ్ నమోదు
విజయనగరం జిల్లాలో 25.68 శాతం పోలింగ్ నమోదు
విశాఖపట్నం జిల్లాలో 24.14 శాతం పోలింగ్ నమోదు
తూర్పుగోదావరి జిల్లాలో 25.00 శాతం పోలింగ్ నమోదు
ప.గో జిల్లాలో 23.40 శాతం పోలింగ్ నమోదు
కృష్ణా జిల్లాలో  19.29 శాతం పోలింగ్ నమోదు
గుంటూరు జిల్లాలో  15.85 శాతం పోలింగ్ నమోదు
ప్రకాశం జిల్లాలో  15.05 శాతం పోలింగ్ నమోదు
నెల్లూరు జిల్లాలో  20.59 శాతం పోలింగ్ నమోదు
కర్నూలు జిల్లాలో  25.96 శాతం పోలింగ్ నమోదు
అనంతపురం జిల్లాలో  22.88 శాతం పోలింగ్ నమోదు
వైఎస్ఆర్ జిల్లాలో  19.72 శాతం పోలింగ్ నమోదు
చిత్తూరు జిల్లాలో  24.52 శాతం పోలింగ్ నమోదు

► నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో జడ్పీటీసీ పోలింగ్‌లో సర్వేపల్లి ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Time: ఉదయం 11.30
►   నెల్లూరు: ఎఎస్‌పేట మండలం పొనుగోడులో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ నిలిచిపోయింది. రేపు(శుక్రవారం) రీ పోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ ఏజెంట్‌ ప్రసాద్ బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లి నీటితొట్టిలో వేయటంతో వివాదం నెలకొంది. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను ప్రసాద్‌ తోసేసి బాక్స్ ఎత్తుకెళ్లాడు. ప్రస్తుతం బీజేపీ ఏజెంట్ ప్రసాద్ పరారీలో ఉన్నాడు.

Time: ఉదయం 11.00
ఏపీ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం బాలుర హైస్కూల్‌లో పోలింగ్ బూత్‌లను సీపీ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. విజయవాడ సిటీ పరిధిలోని 8 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. తొలి మూడు గంటల్లో 13 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి మండలానికి డీసీపీ స్థాయి అధికారిని నియమించామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు.

Time: ఉదయం 10.30
►  నెల్లూరు: ఎఎస్‌పేట మండలం పాముగోడులో పోలింగ్‌ కేంద్ర వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో వృద్ధుడి ఓటు విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద గొడవ జరిగింది. ఓటు వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. బీజేపీ ఏజెంట్‌ బ్యాలెట్ బాక్స్‌ను నీళ్లలో ముంచేయడంతో ఎన్నికలు అధికారులు పోలింగ్‌ నిలిపివేశారు. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను తోసేసి బీజేపీ ఏజెంట్‌ ప్రసాద్‌ బ్యాలెట్‌ బాక్స్ ఎత్తుకెళ్లి నీళ్లల్లో వేశాడు.

► తూర్పుగోదావరి: అమలాపురం రూరల్‌ మండలం సాకుర్రు గున్నేపల్లి పోలింగ్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. బ్యాలెట్ పత్రాలపై జనసేన పార్టీ గుర్తు లేకపోవడంతో అభ్యర్థి ఆందోళన చేశారు. దీంతో పోలింగ్ ప్రక్రియను  అధికారులు నిలిపివేశారు.
►  విశాఖపట్నం: అరకు వ్యాలీలో ఎమ్మెలే చెట్టి ఫాల్గుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

►  కర్నూలు: పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆర్థర్ ఓటు వేశారు.
►  చిత్తూరు: చిత్తూరు మండలం పాలూరులో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్న భీముని చెరువులో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Time: ఉదయం 10.00
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 7.76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో 8.99 శాతం పోలింగ్ నమోదు
విజయనగరం జిల్లాలో 9.01 శాతం పోలింగ్ నమోదు
విశాఖ జిల్లాలో 8.83 శాతం పోలింగ్ నమోదు
తూ.గో జిల్లాలో 4.59 శాతం పోలింగ్ నమోదు
ప.గో జిల్లాలో 9.26 శాతం పోలింగ్ నమోదు
కృష్ణా జిల్లాలో 9.32 శాతం పోలింగ్ నమోదు
గుంటూరు జిల్లాలో 7.52 శాతం పోలింగ్ నమోదు
ప్రకాశం జిల్లాలో 6.53 శాతం పోలింగ్ నమోదు
నెల్లూరు జిల్లాలో 6.36 శాతం పోలింగ్ నమోదు
చిత్తూరు జిల్లాలో 7.29 శాతం పోలింగ్ నమోదు
వైఎస్ఆర్ జిల్లాలో 4.81 శాతం పోలింగ్ నమోదు
కర్నూలు జిల్లాలో 9.58 శాతం పోలింగ్ నమోదు
అనంతపురం జిల్లాలో 7.76 శాతం పోలింగ్ నమోదు

►  తాడేపల్లి: కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌ నుంచి పోలింగ్ ప్రక్రియపై నిఘా పెట్టి, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తున్నామని పేర్కొ​న్నారు. 3,530 మందితో నిరంతరం వెబ్ కాస్టింగ్ జరుగుతోందని తెలిపారు.

►  శ్రీకాకుళం: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్పీ అమిత్‌బర్థార్‌ పర్యవేక్షించారు. శాంతి భద్రత చర్యలను సమీక్షించారు.

Time: ఉదయం 9.30
పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 
►  విశాఖపట్నం: పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

► కృష్ణా:  జిల్లాలోని నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను చూసి భయపడి చంద్రబాబు పారిపోయాడని తెలిపారు. 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు పారిపోతాడని చెప్పారు. పంచాయతీ ఎన్నికల మాదిరే, పరిషత్ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు.

► కృష్ణా: జిల్లా చందర్లపాడులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, జడ్పీటీసీ అభ్యర్థి చింతలపూడి లక్ష్మీనారాయణ, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకోల్లు నరసింహారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలోని అతి సమస్యత్మాక పోలింగ్ కేంద్రాం వద్ద జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఏలూరుడీఎస్పి డాక్టర్ దిలీప్ కిరణ్ పరిశీలించారు. సమస్యత్మాక, అతి సమస్యత్మాక కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.  పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హాక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

► వైఎస్ఆర్ జిల్లా: నందలూరు మండలంలో చెన్నయ్యగారిపల్లెలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Time: ఉదయం 9.00
పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు.
► తూర్పు గోదావరి: మామిడికుదురు మండలంలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పెదపట్నంలంక-సత్తెమ్మపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి తెగపడ్డారు. ఓటర్లకు జనసేన డబ్బు పంచుతుండగా వైఎ‍స్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జనసేన కార్యకర్తల దాడిలో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు.

► శ్రీకాకుళం: పాలకొండలోని వీరఘట్టం మండలం వండువలో ఎమ్మెల్యే కళావతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Time: ఉదయం 8.30
వైఎస్ఆర్‌ కడప: జిల్లాని చాపాడు మండలం అయ్యవారిపల్లెలో టీడీపీ అభ్యర్థి దౌర్జన్యానికి తెగపడ్డారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజేశ్వరి బ్యాలెట్‌ పేపర్‌ను బయటకు తీసుకువచ్చారు.

► అనంతపురం: జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెట్టామని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరంలో భారీ భద్రత ఏర్పాటు చేశామన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు.

Time: ఉదయం 8.00
పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కోనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. గుంటూరు పెదకాకానిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Time: ఉదయం 7.30
పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు తరలివసున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావు పాలెంలో ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Time: ఉదయం 7.00
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. కోవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Time: ఉదయం 6.50
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,058 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల బరిలో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పరిషత్‌ ఎన్నికల కోసం 27,751 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పరిషల్‌ ఎన్నికల పోలింగ్‌లో 2,46,71,002 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

జిల్లాల వారీగా పోలింగ్‌ జరిగే స్థానాలు
శ్రీకాకుళం: 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌
విజయనగరం: 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌
విశాఖపట్నం: 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌
తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌
పశ్చిమగోదావరి: 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌
కృష్ణా: 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌
గుంటూరు: 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌
ప్రకాశం: 41 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌
నెల్లూరు: 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌
చిత్తూరు: 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌
వైఎస్‌ఆర్‌ జిల్లా: 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌
కర్నూలు: 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌
అనంతపురం: 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌

సాక్షి, అమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చింది. అయితే సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న రిట్‌ పిటిషన్‌ పరిష్కారం అయ్యేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అదేవిధంగా ఫలితాలను కూడా ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఎన్నికలను నిలిపివేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పీల్‌ను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ముందున్న రిట్‌ పిటిషన్‌ ఏ రోజైతే విచారణకు ఉందో ఆ రోజు విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

ఎన్నికలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సమయంలోనే వర్ల రామయ్య రిట్‌ పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి అనుమతినిచ్చినట్లయిందని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి సింగిల్‌ జడ్జి వద్ద రిట్‌ పిటిషన్‌ అపరిష్కృతంగా ఉందని తెలిపింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా సింగిల్‌ జడ్జి తుది తీర్పునిచ్చినట్లయిందని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత జరిగిన గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికల సందర్భంగా నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయలేదన్న విషయాన్ని సింగిల్‌ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని ధర్మాసనం ఆక్షేపించింది. వర్ల రామయ్య ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అంశంపై సింగిల్‌ జడ్జి నిర్దిష్టంగా తేల్చలేదని వివరించింది. ఈ మొత్తం వ్యవహారంలో అనేక వివాదాస్పద అంశాలున్నాయని, వీటన్నింటిపై రిట్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తేల్చాల్సి ఉందంది. అందువల్ల అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు