సీఎం జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధుల బృందం

28 Apr, 2022 20:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి ఆటా తెలుగు మహాసభలకు ఆహ్వానించారు. వాషింగ్టన్‌ డీసీ జూలై 1 నుంచి 3 వరకు 17వ ఆటా తెలుగు మహాసభలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ని కలిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాదరెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్‌ కమిటీ ఛైర్మన్‌ సన్నీరెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ జయంత్‌ చల్లా ఉన్నారు.

చదవండి: (గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసిన సీఎం జగన్‌ దంపతులు)

మరిన్ని వార్తలు