బంగినపల్లి.. నున్న టు ఢిల్లీ!

25 Feb, 2021 13:56 IST|Sakshi

నున్న (విజయవాడరూరల్‌): నున్న మ్యాంగో మార్కెట్‌లో మామిడికాయల సీజన్‌ ప్రారంభమైంది. బుధవారం రాత్రి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బంగినపల్లి మామిడికాయలను ప్యాక్‌ చేసి వాటిని లారీలో ఢిల్లీకి ఎగుమతి చేశారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రతాప్, ఈదర గ్రామం నుంచి జాన్‌వెస్లీ, కోడూరు గ్రామం నుంచి వెంకటేశ్వరావు, సాయనపాలెం గ్రామం నుంచి వెంకటేశ్వరావు అనే రైతులు తోటల నుంచి వచ్చిన మామిడి పంట దిగుబడులను, 12 టన్నుల కాయలను వేరు చేసి లోడు చేశారు. ఈ ఏడాది మామిడికాయల సీజన్‌ ప్రారంభంలో బంగినపల్లి మామిడి కాయలు టన్ను ధర రూ.70 వేలకు పలికింది.

మరిన్ని వార్తలు