తాగునీటిలో కాల్షియం తప్పనిసరి

7 Dec, 2020 03:53 IST|Sakshi

తగు మోతాదులో మెగ్నీషియం కూడా ఉండాలి 

జనవరి 1నుంచి ప్యాకేజ్డ్‌ వాటర్‌కు కొత్త నిబంధనలు 

ఖనిజ లవణాలు తొలగించకుండా చూడాలన్న ఎన్జీటీ 

ఆ మేరకు కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు 

సాక్షి, అమరావతి: దేశంలో విక్రయించే ప్యాకేజ్డ్‌ వాటర్‌కు సంబంధించి జనవరి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ప్యాకింగ్‌ చేసి విక్రయించే లీటర్‌ మంచి నీటిలో 20 మిల్లీ గ్రాముల కాల్షియం, 10 మిల్లీ గ్రాముల మెగ్నీషియం తప్పనిసరిగా ఉండాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది. శుద్ధి చేసిన నీటి పేరుతో ఆ నీటిలో శరీరానికి ఉపయోగపడే ఖనిజ లవణాలను కూడా తొలిగిస్తున్నారని, అలా కాకుండా ఆరోగ్యానికి మంచి చేసే ఖనిజ లవణాలు నీటిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐని కోరింది.

ఈ నేపథ్యంలో అందుకనుగుణంగా మంచి నీటిని శుద్ధి చేయడానికి వీలుగా ప్లాంట్లలో మార్పులు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సమయం ఇచ్చింది. దీంతో ఆక్వాఫినా, హిమాలయన్, బైలే, రైల్‌నీర్, ఆక్సీరిచ్, టాటా వాటర్‌ వంటి ప్రముఖ బ్రాండ్లన్నీ ఈ నిబంధనలకు అనుగుణంగా జనవరి1 నుంచి మంచినీటిని మార్కెట్లోకి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. కోకోకోలా (కిన్లే) ఇప్పటికే కొత్త నిబంధనల ప్రకారం ప్యాకేజ్డ్‌ నీటిని మార్కెట్లోకి విడుదల చేసింది. 

55% యూనిట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే.. 
దేశీయ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,000 కోట్ల లీటర్ల నీటి విక్రయాలు జరుగుతున్నాయి. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) దగ్గర ఉన్న సమాచారం ప్రకారం..దేశవ్యాప్తంగా 6,000కు పైగా మినరల్‌ వాటర్‌ తయారీ సంస్థలుండగా వీటిలో 55 శాతం యూనిట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. రెండు లీటర్లు, లీటర్, అర లీటర్, పావు లీటర్‌తోపాటు 15, 20 లీటర్ల బాటిల్స్‌లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా 42 శాతం అమ్మకాలు లీటర్‌ బాటిల్స్‌వి కాగా, ఆ తర్వాతి స్థానంలో అరలీటర్, పావులీటర్ల బాటిల్స్‌ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజ్డ్‌ వాటర్‌ పరిశ్రమ విలువ రూ.26 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.   

ప్యాకేజ్డ్‌ తాగునీటిలో ఉండాల్సినవి లీటర్‌కు  

మరిన్ని వార్తలు