దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా

31 Jul, 2020 13:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా ఆమె తెలిపారు. మరోవైపు తెలగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మీదేవి నట్టింట్లోకి నడిచిరావాలని, బాధలు, కష్టాలు తొలగిపోవాలని వరలక్ష్మిని కొలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే పూజలు చేస్తున్నారు.

నిర్మాత, నటి మంజుల ఘట్టమనేని కూడా ఇంట్లోనే వరలక్ష్మీ వత్రం పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. లక్ష్మీ దేవి అందరి జీవితాల్లోకి ఆనందం, విజయం, ఆరోగ్యం, సంపద తీసుకురావాలని ఆకాంక్షించారు. హీరోయిన్‌ ప్రణీత కూడా అందరికి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు