ఆకట్టుకుంటున్న సీఎం జగన్‌, దిశ యాప్‌ శైకత శిల్పాలు

22 Aug, 2021 19:45 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ఆపదలో ఉన్న ఆడబిడ్డలకు సత్వర సాయం అందేందుకు తోడ్పడుతున్న దిశ యాప్‌పై ప్రముఖ సైకత శిల్పి మంచాల సనత్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. రాఖీ పండగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, దిశ యాప్‌ శైకత శిల్పాలను ఆయన రూపొందించారు.

దిశ యాప్‌ రూపకల్పనతో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్‌ జగన్‌ భద్రత కల్పిస్తున్నారని, మహిళలపై జరిగే ఆటవిక చర్యలను ఈ యాప్‌ ద్వారా అరికట్టడం గొప్ప విషయమని సనత్‌ కుమార్‌ పేర్కొన్నారు. మహిళలందరికీ దిశ యాప్‌ రక్షా బంధన్‌ లాగా పనిచేస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు