Google: గూగుల్‌ సంచలన నిర్ణయం...!

22 Aug, 2021 19:35 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో విండోస్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్‌ కంపెనీ  ఆండ్రాయిడ్ యాప్‌లను విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సపోర్ట్‌చేయనున్నట్లు పేర్కొంది. ఆండ్రాయిడ్‌ యాప్‌లకు మద్దతు ఇచ్చే మొదటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌గా విండోస్‌ 11 నిలిచింది. విండోస్ 11 లో ఆండ్రాయిడ్ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కాకుండా అమెజాన్ యాప్ స్టోర్ ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీలో భారత్‌ స్థానం ఎంతో తెలుసా...!


తాజాగా గూగుల్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌లను, గేమ్‌లను విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పాటుగా ఆపిల్‌ మాక్‌​ బుక్స్‌లో సపోర్ట్‌చేయడానికి గూగుల్‌ ప్రణాళికలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి యూఎస్‌ కోర్టులో ఆపిల్‌ కంపెనీకి, ఏపిక్‌ గేమ్స్‌ మధ్య విచారణ కొనసాగుతుంది. దీంతో గూగుల్‌ ‘గేమ్స్‌ ఫ్యూచర్‌’ అనే అంతర్గత గూగుల్‌ కాన్ఫిడెన్షియల్‌ ప్రెజెంటేషన్‌లో ఈ నిర్ణయాన్ని పొందుపర్చినట్లూ ప్రముఖ టెక్‌ వెబ్‌సైబ్‌ ది వెర్జ్‌ గుర్తించంది. ఈ నిర్ణయాన్ని గూగుల్‌ ప్లే డివిజన్‌ 2020 అక్టోబర్‌ నెలలో తీసుకుంది. ఈ ప్రెజెంటేషన్‌లో భాగంగా గూగుల్‌ 2025 నాటికి గేమింగ్‌ రంగంలో తన రోడ్‌మ్యాప్‌ను సిద్దంచేసుకుంది. 

(చదవండి: ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే వడ్డీ కట్టక్కర్లేదు)

మరిన్ని వార్తలు