సీఎం జగన్‌ బర్త్‌డే: 20వేల మందితో భారీ ర్యాలీ

21 Dec, 2020 18:34 IST|Sakshi

సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీ ర్యాలీ

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. వంద కిలోల కేక్‌ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కట్‌ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. 20 వేల మందితో కృష్ణాపురం ఠాణా నుంచి తుడా కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా జగన్ పాలన సాగుతోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను  యువత ప్లకార్డులతో ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు. (చదవండి: సీఎం జగన్‌ బర్త్‌ డే: కేట్‌ కట్‌ చేయించిన సీఎస్‌, డీజీపీ)

విశాఖ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా  చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర చేపట్టారు. బుచ్చయ్య పేట మండలంలోని లోపూడి, ఎల్‌. సింగవరం, పొట్టి దొరపాలెం, కోమళ్లపూడి గ్రామాల్లో పర్యటించారు. సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాల నాయుడు దేవరాపల్లి మండలం తెనుగుపూడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. (చదవండి: ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం

ప్రకాశం జిల్లా: సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా కనిగిరి వ్యవసాయ మార్కెట్‌లో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ సరితా రెడ్డి, బన్నీ, రంగనాయకుల రెడ్డి, అబ్దుల్ గఫార్, మోహన్‌రడ్డి, టి.సుజాత పాల్గొన్నారు.

తూర్పుగోదావరి: పి.గన్నవరంలో సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు భారీ కేక్‌ను కట్‌ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ వరలక్ష్మి చినబాబు, పీకే రావు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు
హైదరాబాద్‌లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రపుల్లా రెడ్డి.. పంజాగుట్టలో కేక్‌ కట్‌ చేసి వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

మరిన్ని వార్తలు