సీఎం జగన్‌ కృషితో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్..

4 Sep, 2020 15:24 IST|Sakshi

గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్‌ ఇంతియాజ్

సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం విమానాశ్రయంలో జరుగుతున్న రన్ వే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్,ఎయిర్ పోర్ట్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం కోసం నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.470 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. 3.5 లక్షల స్క్వేర్ ఫీట్స్ లో భవన నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. (చదవండి: కోవిడ్‌ పేషంట్లకు వేల బెడ్లు అందుబాటులో..)

ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం జరిగితే ఆంధ్రరాష్ట్రానికే తలమానికంగా నిలువనుందన్నారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ మంజూరుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు