ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందిన కరోనా బాధితుడి మృతి

2 Apr, 2021 11:14 IST|Sakshi

తెనాలి రూరల్‌: ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందిన వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయి.. ఆ తర్వాత అతను మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. బాధితుడు వస్తే పెద్దాస్పత్రికి పంపకుండా ఎలా చికిత్స చేస్తావంటూ ఆర్‌ఎంపీని నిలదీశారు. తెనాలి పట్టణంలో చిల్లర కొట్టు నిర్వహించే శ్రీనివాసచక్రవర్తి(45) కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురయ్యాడు.

ఇంటి సమీపంలోని ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లగా జ్వరం ఉందని మందులిచ్చి పంపాడు. మూడు రోజుల తర్వాత తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆర్‌ఎంపీ చేతులెత్తేశాడు. ఈ క్రమంలో బాధితుడిని కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అయితే ఆర్‌ఎంపీ నిర్లక్ష్యం కారణంగానే వ్యాధి ముదిరి శ్రీనివాసచక్రవర్తి మృతి చెందాడని ఆరోపిస్తూ క్లినిక్‌ ఎదుట మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పారు. క్లినిక్‌ను 10 రోజుల పాటు మూసేయాలని ఆదేశించారు.
చదవండి:
‘మత్తు’ వదిలిస్తున్న ‘ఆపరేషన్‌ నయా సవేరా’  
ముంచంగిపుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్‌ 

మరిన్ని వార్తలు