దళితులు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

31 Aug, 2020 12:33 IST|Sakshi

మంత్రులు పుష్పశ్రీవాణి, తానేటి వనిత

సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అంటూ అవమానించిన చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఎస్టీలకు తెలివి ఉండదని చంద్రబాబు హేళన చేశారని.. ఆయనను చూసి ఎస్సీ, ఎస్టీలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ‘‘రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీలకు ఎవరూ ఇవ్వనన్నీ పథకాలు అమలు చేస్తున్నాం. కోటి 13 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్‌దే ఎస్సీ, ఎస్టీలకు ఏడాదిలోనే 13వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో అందించాం. దళితులు, గిరిజనులపై దాడులు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని’’ మంత్రి వెల్లడించారు. (చదవండి: చంద్రబాబు దళిత ద్రోహి: దళిత నేతలు)

పశ్చిమగోదావరి: చంద్రబాబు దళిత ద్రోహి అని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఏనాడూ దళితులను ఆయన పట్టించుకోలేదన్నారు. దళితులపై చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ కేబినెట్‌లో ఐదుగురు దళితులకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు దళితులు గుణపాఠం చెబుతారని తానేటి వనిత అన్నారు.(చదవండి: ‘చంద్రబాబుకు ప్రేమలేదు.. అంతా డ్రామా’)

మరిన్ని వార్తలు