57.04 లక్షల మందికి రూ.1450.75 కోట్ల పింఛన్‌

3 Feb, 2022 04:03 IST|Sakshi
ప్రకాశం జిల్లా: గుంటూరు ఆస్పత్రిలో పింఛన్‌ డబ్బు అందించేందుకు వేలిముద్ర తీసుకుంటున్న వలంటీర్‌ శ్యాంబాబు

బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన పంపిణీ.. 

ఇప్పటికే 92.78 శాతం లబ్ధిదారులకు చేరిన డబ్బులు

మరో మూడు రోజులు కొనసాగనున్న పంపిణీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ కొనసాగింది. మంగళ, బుధవారాల్లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 57,04,996 మంది లబ్ధిదారులకు రూ.1450.75 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేసింది. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 61,51,660 మందికి ప్రభుత్వం రూ.1563.73 కోట్ల మొత్తాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

రెండు రోజులుగా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికే 92.78 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయింది. గురు, శుక్ర, శనివారాల్లో కూడా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ కొనసాగుతుందని గ్రామీణ పేదిరక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లాలో అత్యధికంగా 94.85 శాతం పంపిణీ పూర్తయింది.   

మరిన్ని వార్తలు