ఏపీ: మిగిలిన స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

1 Nov, 2021 13:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 14, 15,16 తేదీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.

(చదవండి: నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్‌: సీఎం జగన్‌

పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్‌, 18న కౌంటింగ్‌ జరపనున్నారు. అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది. 

ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌
నెల్లూరు కార్పొరేషన్‌కు జరగనున్న ఎన్నిక
నవంబర్‌ 15న మున్సిపాలిటీల్లో ఎన్నికలు, 17న ఫలితాలు
కార్పొరేషన్లలో మిగిలిపోయిన డివిజన్లకు జరగనున్న ఎన్నిక
7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు జరగనున్న ఎన్నిక
12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక

498 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్‌లకు ఎన్నిక
మిగిలిపోయిన 533 వార్డు మెంబర్లకు జరగనున్న ఎన్నిక
గ్రామ పంచాయతీల్లో ఈనెల 14న ఎన్నిక, అదేరోజు కౌంటింగ్‌

13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలకు ఎన్నిక
13 జిల్లాల్లో మిగిలిపోయిన 16 జడ్పీటీసీలకు ఎన్నిక
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఈనెల 16న ఎన్నికలు, 18న ఫలితాలు

అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్లు
పంచాయతీల్లో 14న, మున్సిపాలిటీల్లో 15న, జడ్పీటీసీల్లో 16న ఎన్నిక

మరిన్ని వార్తలు