ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు

19 Aug, 2023 08:17 IST|Sakshi

అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది

గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగా ఈరోజు  పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. 

ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్‌ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్‌ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు.   

ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్‌ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్‌ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్‌ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్‌ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు.

మరిన్ని వార్తలు