AP: చిన్నారి ప్రాణం నిలబెట్టిన నియోనాటాల్‌ అంబులెన్స్‌

9 Nov, 2021 12:15 IST|Sakshi
శిశువును కర్నూలుకు తరలించిన నియోనాటల్‌ అంబులెన్స్‌

సాక్షి, బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన అత్యాధునిక నియోనాటాల్‌ అంబులెన్స్‌తో ఓ నవజాత శిశువు ప్రాణం నిలబడింది. నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన ఓ పసికందును అంబులెన్స్‌ సిబ్బంది వైద్యం అందిస్తూ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన అంజలి కాన్పు కోసం ఆదివారం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం ఆడ శిశువుకు  జన్మనిచ్చింది.  కాగా శిశువుకు శ్యాస సంబంధిత సమస్యతో ఊపిరి తీసుకోవటం కష్టంగా మారింది.


వాహనంలో చికిత్స పొందుతున్న పసికందు

అక్కడి వైద్యులు కర్నూలుకు రెఫర్‌ చేశారు. వెంటిలేటర్‌ మీదనే తరలించాల్సి రావడంతో నియోనాటాల్‌ అంబులెన్స్‌ వాహనంలో తీసుకెళ్లారు. వాహనంలోని వెంటిలేటర్, ఇన్ఫూసియన్‌ పంప్, సిరంజ్‌ పంప్‌ల సహకారంతో ఈఎంటీలు మహేష్, రియాజ్‌ పసికందుకు చికిత్స అందిస్తూ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవజాత శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యాధునిక వసతులు ఉన్న అంబులెన్స్‌ ద్వారా తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టారని తల్లి అంజలి సంతోషం వ్యక్తం చేసింది.  
AP: క్యార్‌మనగానే..కేర్‌

మరిన్ని వార్తలు